Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో అంబేద్కర్ చిత్రపటానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పుష్పాం జలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు,ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నవీన్‌రావు,పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సెక్రెటరీ రాజశేఖర్‌రెడ్డి, ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.