Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు చీఫ్‌జస్టిస్ సతీష్‌చంద్రశర్మ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వివక్షతను ఎదుర్కొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ వాటిని రూపుమాపేందుకు చేసిన కృషి శ్లాఘనీయమని హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ అన్నారు. బాల్యం నుంచి ఆయన బడిలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. వేటికీ వెరవకుండా ధీరుడిగా నిలబడినందున్నే అంబేద్కర్ మహాశక్తిగా మారారని కొనియాడారు. అంటరానితనాన్ని రూపమాపేందుకు, అందరికీ సమాన హక్కులు కల్పించేందుకు అంబేద్కర్ చేసిన సేవలు చిరస్థాయిగా ఉంటాయన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని గురువారం హైకోర్టు బార్ అసోసియేషన్, స్టేట్ బార్ కౌన్సిల్ కలిసి నిర్వహించిన సభకు చీఫ్‌జస్టిస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యాంగ రూపకల్పనలో స్వేచ్ఛ, సమానత్వాలకు పెద్ద పీట వేశారని ఈ సందర్భంగా చెప్పారు. న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్‌భూయాన్, జస్టిస్ ఎస్.నంద మాట్లాడుతూ, రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ అందించిన హక్కుల వల్లనే నేడు మనమంతా స్వేచ్ఛగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మెన్ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ చైర్మెన్ పొన్నం అశోక్ గౌడ్, జనరల్ సెక్రటరీ కళ్యాణ్‌రావు, ఏజీ బిఎస్ ప్రసాద్ ఇతరులు ప్రసంగించారు.
కౌంటర్ వేయకపోతే కోర్టుకు రండి
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుర్వాసనతో అనేక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నామంటూ దాఖలైన కేసులో జీహెచ్ఎంసీ కమిషనర్ కౌంటర్ దాఖలు చేయకపోతే తదుపరి విచారణకు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. డంపింగ్ యార్డ్‌ను తరలించే ప్రదేశాల్ని గుర్తించామన్న అధికారులు వాటిపై వివరాలు ఇవ్వకపోవడాన్ని గురువారం హైకోర్టు ఆక్షేపించింది. గజ్వేల్‌లోని చెరువుల్లో మట్టి అక్రమ తవ్వకాలపై పిల్లో కౌంటర్ కోసం ఇరిగేషన్, మైనింగ్ శాఖల ముఖ్య కార్యదర్శులకు కూడా కడసారి అవకాశం ఇచ్చింది. హైదరాబాద్ నగరంలోని పుప్పాలగూడలో నాలా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడం లేదన్న మరో పిల్లో ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శికి కూడా నోటీసులు ఇచ్చింది. ఈ కేసుల్లో రెండేండ్లకుపైగా కౌంటర్లు వేయకపోవడాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీవ్రంగా పరిగణించింది. ఈసారి కౌంటర్లు దాఖలు చేయకపోతే స్వయంగా హాజరుకావాలని ముగ్గురు అధికారులకు ఆదేశాలిచ్చింది.