Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ
- శాంతాసిన్హా చేతులమీదుగా ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మహిళా ఉద్యమ నేత మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ శుక్రవారంహైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.జ్యోతి అధ్యక్షతన జరగనున్నదని ఆ సంఘం రాష్ట్ర కమిటి గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సంస్మరణ సభకు ముఖ్య వక్తలుగా ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, సంఘం జాతీయ నాయకులు ఎస్ పుణ్యవతి, ఆంద్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ హజరుకానున్నారు. వక్తలుగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, ఆ సంఘం సీనియర్ నేతలు అల్లూరి మన్మోహినీ, పుతుంబాక భారతి, ఆంద్రప్రదేశ్ ఐద్వా అధ్యక్షులు ప్రభావతి, ఎన్ఎఫ్ఐడబ్ల్యు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జ్యోతి, ప్రగతి శీల మహిళా సంఘం(పీఓడబ్ల్యు) నేతలు సంధ్య, ఝాన్సీ, ఎన్సీపీసీఆర్ మాజీ చైర్పర్సన్ శాంతసిన్హా, హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ ట్రస్టీ గీతా రామస్వామి, కలమిస్టు సజయ, భూమిక ఎడిటర్ కొండవీటి సత్యవతి, ఐద్వా రాష్ట్ర అధ్యక్షరాలు ఆర్ అరుణజ్యోతి, ఉపాధ్యక్షురాలు హైమావతి, సాంస్కృతిక కార్యకర్త పిఏ దేవి, రచయిత్రి విమల, ఆరుణోదయ నాయకురాలు విమలక్క తదితరులు ప్రసంగిస్తారు. మల్లు స్వరాజ్యం సాయుధ పోరాట కాలంలో దళ సభ్యురాలిగా నిర్వహించిన పాత్ర, ప్రజాప్రతినిధిగా అందించిన సేవలు మహిళా ఉద్యమ నేతగా నిర్వహించిన పోరాటాలు, వివిధ బహిరంగ సభల్లో చేసిన ప్రసంగాలు, ఆమె అంతిమ ఘట్టం కూడా ఆదర్శప్రాయంగా ముగిసిన తీరును వివరిస్తూ సంబంధిత ఫొటోలతో కూడిన ఎగ్జిభిషన్‌ను ఈ సందర్భంగా నిర్వహించనున్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటి చైర్పర్సన్ శాంతా సిన్హా చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు.