Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజరు పాదయాత్రపై మంత్రి కేటీఆర్ బహిరంగలేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు చేస్తున్నది ప్రజావంచన యాత్ర అని మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ఆయన ఏ హక్కుతో రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారంనాడయన ప్రజలకు బహిరంగ లేఖ రాసారు. పచ్చ బడుతున్న పాలమూరుపై కక్ష కట్టిన బీజేపీకి అక్కడ అడుగుబెట్టే హక్కులేదని లేఖలో పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడికి పాల్పడుతున్నదనీ, నీళ్లిచ్చే ప్రాజెక్టులపై బోర్డుల బోడిపెత్తనం ఏంటని అడిగారు. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌పై కనికరం చూపి,పక్కనే ఉన్న పాలమూరు ఎత్తి పోతల పథకానికి జాతీయ హూదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీజేపీకి విభజన హామీలు నెరవేర్చే తెలివిలేదనీ, నీతి ఆయోగ్ చెప్పినా నిదులిచ్చే నీతి లేదనీ విమర్శించారు. ఉచిత కరెంట్ ఇస్తుంటే మోటర్లకు మీటర్ల పెట్టమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారనీ, పండించిన పంటలు కొనకుండా రైతును గోస పెడుతున్నారనీ పేర్కొన్నారు. కడుపులో ద్వేషం పెట్టుకొని కపట యాత్రలు చేస్తే ఏం లాభమని ప్రశ్నించారు. మోకాళ్ల యాత్ర చేసి తెలంగాణకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెల్లారి లేస్తే రాముడి పేరుతో రాజకీయాలు చేసే నీచమైన భారతీయ జనతా పార్టీ,భద్రాద్రి క్షేత్రానికి ఏం చేసిందో తెలంగాణ ప్రజలకు తెలపాలన్నారు.