Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ స్పష్టీకరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందనీ, దీనిపై రైతాంగం ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు స్పష్టం చేశారు.ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) పరిధిలో గురువారం సమాచార లోపం, అనివార్య కారణాలతో వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందనీ, శుక్రవారంనుంచి గతంలో మాదిరే రైతాంగానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరా యధావిధిగా కొనసాగుతుందని ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదనీ, రైతులు ఆందోళన చెందల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.