Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్మరణ సభలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ సతీమణి వసుమతిదేవి గొప్ప సామ్యవాది, నిబద్ధత గల ప్రజానాయకురాలు అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు విఎస్ బోస్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటి నరసింహ, ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు ఉజ్జిని రత్నాకర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి ఎం నరసింహ అన్నారు. ఆమె అకాల మరణం సీపీఐ, ఏఐటీయూసీకి తీరనిలోటని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్లో సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వసుమతి సంస్మరణ సభ నిర్వహించారు. ఆమె చిత్రపటానికి నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు భావజాలంతో ఉద్యమబాట పట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నేత మర్రి జ్యోతి, నాయకులు శ్రీమాన్, జగన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.