Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40 లక్షల మైలురాయి దాటిన సభ్యత్వం
- మే మొదటివారంలో రాహుల్ రాక : మహేష్‌కుమార్‌గౌడ్ వెల్లడి
నవతెలంగాణబక్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ ముగిసిందనీ, ఇప్పటికీ 40 లక్షల మైలురాయి దాటిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ చెప్పారు. సభ్యత్వం తీసుకున్న వారికి బీమా చెల్లించినట్టు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. అంతకు ముందు పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ముఖ్యనేతల సమావేశం జరిగింది. తాజా రాజకీయాలు, సభ్యత్వం, రాహుల్ రాక తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌గౌడ్ విలేకర్లతో మాట్లాడారు. సభ్యత్వం, బీమా క్లెయిమ్స్ కోసం గాంధీభవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వారికి ఎలాంటి ప్రమాదం జరిగిన బీమా క్లెయిమ్స్ అయ్యేలా చూసేందుకు బాధ్యులను కేటాయించినట్టు చెప్పారు. రాహుల్‌గాంధీ తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించేందుకు సమయం కేటాయించారని తెలిపారు. మే మొదటివారంలో రాష్ట్రానికి వచ్చే అవకాశముందనీ, అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే ఏఐసీసీ ప్రకటించనుందన్నారు. రాహుల్‌గాంధీ తన పర్యటన మొదటి రోజు వరంగల్ బహిరంగసభలో ప్రసంగిస్తారనీ, రెండోరోజు హైదరాబాద్‌లో జరిగే కాంగ్రెస్ ముఖ్యనాయకుల సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్చార్జీ మణిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎన్నికల నిర్వాహణ కమిటీ చైర్మెన్ దామోదర రాజనర్సింహ, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.