Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంసీపీఐ(యూ) కేంద్ర కమిటీ సమావేశాలు ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు హైదరాఆద్లో జరగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని ఓంకార్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల నుంచి పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు హాజరవుతారని చెప్పారు. దేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన నిరుద్యోగం, అధిక ధరలు, మతోన్మాదం, రాష్ట్రాల అధికారాలను హరించే కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలు, జనగణనలో బీసీ గణన చేయకపోవడం, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, బీసీ రిజర్వేషన్, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు వంటి అంశాలపై చర్చిస్తామని వివరించారు. బూర్జువా, భూస్వామ్య, పెట్టుబడిదారీ పాలకవర్గ పార్టీలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు, సామాజిక శక్తుల ఐక్యసంఘటన నిర్మాణంపై ప్రజాపోరాటాల విస్తృతి కోసం చర్చిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్‌రెడ్డి, కుంభం సుకన్య, వనం సుధాకర్, పెద్దారపు రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం నాగార్జున తదితరులు పాల్గొన్నారు.