Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూసీవాగు సోలిపేట శివారులో ఘటన
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
చేపల వేటకు వెళ్లి మూసీనదిలో పడి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని మూసీవాగు సోలిపేట శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. సూర్యాపేట రూరల్ ఎస్ఐ ఆర్.సాయిరాం తెలిపిన వివరాల ప్రకారం.. జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఈర్ల పిచ్చయ్య(36) ముదిరాజ్ తండ్రి నర్సయ్య కొన్ని రోజులుగా మూసీవాగులో గుడిసెలు వేసుకుని చేపల వేట సాగిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మూసీ రిజర్వాయర్లో చేపలవేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు వల కాళ్లకు చుట్టుకోవడంతో చెరువులో పడి మృతి చెందాడు. మృతునికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతురాలి భార్య ఈర్ల చైతన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.