Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్
- శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఓట్ల రాజకీయలను మానుకొని ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడితే చాలా మంచిదని తెలంగాణ శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పండించిన వడ్లను కొనాల్సిన కేంద్రం మొండి వైఖరితో రైతులను ఇబ్బందులు పెట్టిందన్నారు. స్వయంగా రైతు కావడం వల్ల.. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి.. రైతన్నల బాధను గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించినట్టు తెలిపారు. రైతులందరి పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. 'మేమే మెడలు వంచి రాష్టాన్ని ధాన్యాన్ని కొనేలా చేశాం' అనే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదన్నారు. జాతీయ పార్టీలకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలని, దేశంలో ఉన్న పరిస్థితిలు గమనించాలని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రానికి రాకుండా చెక్‌పోస్ట్‌లు పెట్టడం హర్షించదగినదన్నారు.