Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నదిలోనే గుండెపోటుతో విశాఖ వాసి మృతి
నవతెలంగాణ - జైపూర్
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట పుష్కరఘాట్ వద్ద శుక్రవారం అపశృతి చోటుచేసుకుంది. ప్రాణహిత పుష్కరస్నానానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్రం విశాఖ జిల్లాకు చెందిన సోమేశ్(39) ప్రాణహిత నదిలో స్నానం చేస్తూ గుండెపోటుతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం అర్జునగుట్ట పుష్కరఘాట్‌కు చేరుకున్న సోమేశ్ కుటుంబ సభ్యులతో కలిసి పుష్కరస్నానం చేశాడు. కుటుంబ సభ్యులంతా స్నానం ముగించుకుని బయటకు వస్తున్న క్రమంలో సోమేశ్ నదిలో మునిగి లేవలేదు. వెంటనే కుటుంబసభ్యులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టి నది అడుగు భాగం నుంచి సోమేశ్ మృతదేహాన్ని బయటకు తీశారు. నదిలో మునుగుతున్నప్పుడే గుండెపోటు వచ్చి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. మృతుని భార్య సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబంలో విషాదం
12 ఏండ్లకోసారి వచ్చే పుష్కరాల్లో పాల్గొనేందుకు విశాఖ నుంచి వచ్చిన కుటుంబంలో విషాదం నెలకొంది. అప్పటి వరకు కుటుంబసభ్యులంతా పుష్కరఘాట్ల వద్ద సందడి చేశారు. ఇక స్నానాలు ముగించుకుని తిరుగు ప్రయా ణం అవుతామనుకున్నారు. కానీ సోమేష్ గుండెపోటుతో మృతిచెందడం ఆ కుటుం బంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భర్త, బంధువులతో కలిసి వచ్చిన సోమేశ్ భార్య సుమలత భర్త మృతదేహం వద్ద రోదించగా.. అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.