Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అర్వపల్లి
వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం పర్సాయపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివరాత్రి భిక్షం(60) రోజు మాదిరిగా వ్యవసాయ పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో ఎండ వేడిమికి తట్టుకోలేక అస్వస్థతకు గురవ్వడంతో గ్రామంలోని ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎంపీటీసీ రాచకొండ గీత సురేష్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి, నివాళులర్పించారు.