Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 70 వేలు నష్టం
నవతెలంగాణ -వంగూరు
పిడుగుపాటుకు కాడెద్దు మృతిచెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం వేలుమలపల్లిలో ఆదివారం చోటుచేసుకున్నది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దుళ్ళ లింగయ్య.. రోజు మాదిరిగానే తన వ్యవసాయ పొలంలో శనివారం రాత్రి కాడెద్దును కట్టేసి ఇంటికి వచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున వెళ్లి చూడగా పిడుగుపాటుకు గురై చనిపోయిందని తెలిపారు. దీని విలువ సుమారు రూ. 70 వేలు ఉంటుందన్నారు. కాడెద్దు చనిపోవడంతో వ్యవసాయం ఎలా చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.