Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జాతీయ నాయకులు ఎస్.పుణ్యవతి తదితరుల నివాళి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎల్ఐసి ఉద్యోగ సంఘం నేత కె. సరోజిని శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయస్సు 72 సంవత్సరాలు. హైదరాబాద్లోని నేరేడ్మెట్లోని నివాసంలో ఉంచిన సరోజిని భౌతికకాయానికి ఐద్వా జాతీయ నాయకురాలు ఎస్.పుణ్యవతి, సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు డిజి నర్సింహారావు, టి.జ్యోతి, ఆలిండియా ఇస్సూరెన్సు ఎంప్లాయిస్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్, బ్యాంకింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రఘు, శివగణేష్, కామేశ్ బాబు, రాధేశ్యామ్, పట్నం రాష్ట్ర నాయకులు డిఎఎస్వి ప్రసాద్, తదితరులు నివాళులర్పించారు. ఆదివారం మధ్యాహ్నం అల్వాల్ స్మశానవాటికలో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. సరోజిని భర్త కర్లపాలెం మధుసూధన్ రావు మచిలీపట్నం డివిజన్లో ప్రజాతంత్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరిం చారు. అక్కడి నుంచి ఉద్యోగరీ త్యా హైదరాబాద్కు వచ్చిన వారు ఇక్కడే స్థిరప డ్డారు. మధుసూధన్ రావు మరణాన ంతరం ఉద్యోగంలో చేరిన సరోజిని.. ఎల్ఐసి సికింద్రాబాద్ డివిజన్లో వర్కింగ్ ఉమెన్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ మధ్యతరగతి ఉద్యోగులను ఐక్యం చేసి వారి సమస్యలపై నిరంతరం పోరాడారు. మహిళా సంఘం కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొన్నారు.