Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ
నవతెలంగాణ-ఓయూ
టీఎస్ టెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంకా ఉన్నారనీ, దరఖాస్తు గడువు ముగియడంతో వెంటనే గడువు పెంచాలని ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ అధ్యక్షకార్యదర్శులు ఆంజనేయులు, రవినాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఓయూ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ టెట్ దరఖాస్తు గడువు కేవలం 18 రోజులు మాత్రమే ఇచ్చిందనీ, ఆరు లక్షల మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇంకా వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని, ఇంటర్నెట్ సెంటర్లలో సర్వర్ డౌన్ లాంటి టెక్నికల్ సమస్యలతో పలువురు దరఖాస్తు చేసుకోలేదని, అలానే తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
టీిఎస్ టెట్ అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పొడిగించాలని కోరారు. కరోనా కారణంగా, నోటిఫికేషన్లు లేకుండా నష్టపోయిన విద్యార్థులకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో గ్రూప్ వన్ క్యాడర్‌కు సంబంధించి వయస్సును పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ విజరు నాయక్, ఓయూ ఉపాధ్యక్షురాలు మమత, సాయికిరణ్ నాయకులు పవన్, రవిరత్న, రాజు, నవీన్, మనోజ్, ఉదరు, కళ్యాణ్, సురేష్, చంటి, హరీష్ పాల్గొన్నారు.