Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూస్వామ్య.. పెత్తందార్ల పోరాట స్ఫూర్తితో..
- ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నవతెలంగాణ-కొత్తగూడెం
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి విద్యార్థులు భూస్వామ్య, పెత్తందార్ల పోరాట స్పూర్తితో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో చేరి నేటి వరకు అభ్యుదయ భావాలతో పనిచేస్తున్నామని, ప్రాణమున్నంత వరకూ ఇదేవిధంగా ఉంటామని ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పలువురు ఉద్ఘాటించారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో 1980వ దశకంలో ఎస్ఎఫ్ఐలో పనిచేసిన పూర్వవిద్యార్థుల సమ్మేళనం స్థానిక సూర్య ప్యాలెస్ హౌటల్లో నిర్వహించారు. మేక ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పూర్వవిద్యార్థు లు బి.వెంకట్, ఎం.సాయిబాబు మాట్లాడారు. విద్యార్థి దశలో ఆనాడు పల్లె, గ్రామీణ ప్రాంతాల్లో భూస్వామ్య, పెత్తందార్ల,బానిస వ్యవస్థ నుంచి పట్టణ ప్రాంతాలకు చదువుల కోసం వచ్చిన నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ జీవితానికి మార్గదర్శకత చూపిందని తెలిపారు. చెడు దారుల్లో వెళ్లకుం డా విద్యార్ధి దశ నుంచి ప్రశ్నించేతత్వం నేర్పిందన్నారు. 'అధ్యయనం, పోరాటం' నినాదంతో అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన విషయాలు గుర్తుచేశారు.
అభ్యుదయ భావాలతో నేటికి ఉన్నామంటే కేవలం ఎస్ఎఫ్ఐ నేర్పిన క్రమశిక్షణే అన్నారు. కోవిడ్ సమయంలో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులు అందించిన ఆర్ధిక సహాయంతో ఎంతో మంది పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశామని గుర్తుచేశారు.పూర్వ విద్యార్థులు ఏ రంగంలో ఉన్నప్పటికీ పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానా లపై, సమాజ మార్పుకోసం ప్రశ్నించాలన్నారు.
ప్రజా సమీకరణతో పోరాటాలు చేయాలన్నారు. ప్రాణమున్నంత వరకు అభ్యుదయ భావాలతో ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కొండపల్లి పవన్, మన్యం రవి, చావా రవి,అనురాధ, వనజ, జలసూత్రం శివరాం ప్రసాద్, ఎస్వీ రాఘవులు, షణ్ముఖరావు, వీరభద్రం, మేకల రాజమల్లు,కనకయ్య,గుగులోత్ ధర్మా, జాస్తీ రమేష్, అన్నవరపు కనకయ్య, భూక్యా రమేష్, లిక్కి బాలరాజు, అన్నవరపు సత్యనారాయణ, డి.వీరన్న, బి.వీరభద్రం, నందిపాటి రమేష్, భూక్యా రవి, రెండు తెలుగు రాష్ట్రాలలో లాయర్స్, టీచర్, రాజకీయ, సింగరేణి, వివిధ రంగాల వృత్తుల్లో స్థిరపడ్డ వారందరూ పాల్గొన్నారు.