Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది సరఫరా లక్ష్యం అదే : ఏరియా జీఎంలకు డైరెక్టర్ల ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 57 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేయాల్సి ఉంటుందని సింగరేణి కాలరీస్ డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్ (ఆపరేషన్స్), డి సత్యనారాయణరావు (ఈ అండ్ ఎం) తెలిపారు. ఈ మేరకు వారు ఏరియా జీఎంలకు ప్రణాళికా ఆదేశాలు జారీ చేశారు. బొగ్గు సరఫరా తీరుపై సోమవారం వారు నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెలలో (ఏప్రిల్) 4.8 మిలియన్ టన్నుల రవాణా జరగాల్సి ఉండగా, ఏప్రిల్ 17వ తేదీ నాటికి 2.67 మి. టన్నులు సరఫరా చేసినట్టు తెలిపారు. సమావేశంలో జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్, మార్కెటింగ్) కే సూర్యనారాయణ, కోల్ మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే ఆల్విన్, ఎన్టీపీసీ డైరెక్టర్ డీ .సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.