Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం రైల్ నిలయం ఆడిటోరియంలో సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఆ సంస్థ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ రాజీవ్ కిశోర్ అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ కృషిని కొనియాడారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ సమాన గౌరవం లభించాలని ఆయన కాంక్షించారని తెలిపారు. సమావేశంలో పలు కార్మిక, సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.