Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేతలకు టీఎస్ఈఆర్సీ చైర్మెన్ స్పష్టీకరణ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
వ్యవసాయ కనెక్షన్ల మోటార్లకు కరెంటు మీటర్లు పెట్టాలని తాము చెప్పలేదని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) చైర్మెన్ తన్నీరు శ్రీరంగారావు స్పష్టంచేశారు. ఈఆర్సీని ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. ఆయన ఈఆర్సీ ఆర్డర్లపై అవగాహనతో మాట్లాడిఉండరని అభిప్రాయపడ్డారు. ఆ కాపీలను తాము పంపిస్తామనీ, చదువుకోవాలని సూచించారు. గత నెలలో విద్యుత్ టారిఫ్ ఆర్డర్ ఇచ్చామనీ, దానితోపాటే డిస్కంలకు కొన్ని సలహాలు సూచనలు చేసినట్టు చెప్పారు. వ్యవసాయ బావులకు సంబంధించి ట్రాన్సార్మర్ల వద్ద స్మార్ట్ మీటర్లు పెట్టాలని ఆదేశించామనీ, రైతుల మోటార్ల దగ్గర మీటర్లు పెట్టాలని చెప్పలేదన్నారు. ఈఆర్సీనే మోటార్లకు మీటర్లు పెట్టాలని సదరు ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఐదు లక్షల ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయని తెలిపారు. మంగళవారం టీఎస్ఈఆర్సీ బృందం కామారెడ్డి జిల్లాల్లో విద్యుత్ సరఫరా, సమస్యలు తెలుసుకొనేందుకు పర్యటిస్తున్నదని వివరించారు.