Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్పేస్ టెక్ రంగంలో ప్రయివేటు రంగానికి భాగస్వామ్యం కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించింది. సోమవారం సాయంత్రం మెట్వర్స్లో అధికారికంగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీంతో స్వదేశీ అభివృద్ధితో పాటు విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు ఉపయోగముంటుందని తెలిపారు. ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానంతో హబ్ ఏర్పాటు, విదేశీ పెట్టుబడులను, భాగస్వాములను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో నిటిఆయోగ్ సీఈవో అమితాభ్ కాంట్, ఇస్రో చైర్మెన్ ఎస్.సోమ్ నాథ్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్, రిప్రజెంటీటివ్స్ చైర్మెన్ డాక్టర్ పవన్ గోయెంకా తదితరులు పాల్గొన్నారు.