Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 52 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనీ, అందులో 40 కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మిగిలిన 12 మంది జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని వారికి చెల్లించాల్సి ఉందని పేర్కొంది. 2015, సెప్టెంబర్ 22న జారీ చేసిన జీవోనెంబర్ 173 ప్రకారం ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబానికి రూ.ఆరు లక్షలు పరిహారం చెల్లింపునకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చిందనీ, అందుకనుగుణంగా 40 కుటుంబాలకు పరిహారం చెల్లించామని తెలిపింది. ఈ వివరాలను రికార్డు చేసిన హైకోర్టు మిగిలిన జిల్లాల్లోనూ చెల్లింపులు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. జీవో 173 ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.ఆరు లక్షలు పరిహారం చెల్లించాల్సి ఉందని పేర్కొంది. జీవో మేరకు పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన కొండల్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిని చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. వికారాబాద్ జిల్లాలో 13, యాదాద్రి భువనగిరి జిల్లాలో 23, పెద్దపల్లి జిల్లాలో నాలుగు చొప్పున కుటుంబాలకు పరిహారం చెల్లింపులు జరిగాయని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. విచారణ రెండు నెలలకు వాయిదా పడింది.
మెట్రో రైళ్లకు విద్యుత్ చార్జీల పెంపుపై రిట్
మెట్రో రైళ్లకు విద్యుత్ చార్జీల పెంపునకు కారణాలు వివరించాలని టీఎస్ఎస్పీడీసీఎల్కు హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సోమవారం నోటీసులు జారీ చేసింది. విద్యుత్ చార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎల్అండ్టీ (మెట్రో) రైలు లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది.
మెట్రో రైలు విభాగాన్ని ప్రత్యేకంగా పరిగణించిందని పిటిషనర్ వాదించారు. 2003లో చేసుకున్న ఒప్పందానికి ఈ పెంపు విరుద్ధమని కోర్టు ఈ సందర్భంగా చెప్పింది. ఈనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చార్జీల పెంపు నిర్ణయం అమలు కాకుండా ఉత్తర్వులివ్వాలని కోరింది. 2022-23 ఏడాది కేవీఏకు రూ.390 నుంచి రూ475కు పెంపుదల చేయడం వల్ల 2018 నుంచి నష్టాల్లో ఉన్న మెట్రోకు తీరని కష్టమని పేర్కొంది. విచారణ మంగళవారం కొనసాగనుంది.