Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం చర్యలు తీసుకోవాలి
- కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అక్రమ క్వారీలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ రావుపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు డిమాండ్ చేశారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్లో ఆమె మాట్లాడుతూ సంతోష్ రావుపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామంలో తనకున్న కొద్దిపాటి భూమిని సైతం తాను ఏ రకంగా వినియోగించుకోకుండా క్వారీ చెత్త పోశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే రెవెన్యూ, మైనింగ్, పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. రూ.ఐదు కోట్ల విలువైన తనకు ఆస్తులున్నట్టు చూపించిన సంతోష్ రావు, ఆయన బాబారు, చెల్లి అర్హత లేకపోయినా పట్టాలు తీసుకున్నారు. 4,231 మంది ముంపు గ్రామాల ప్రజలకు పట్టాలు రావని వివరించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడున్న వారందరిపై చర్యలు తీసుకోవాలని రమ్యారావు డిమాండ్ చేశారు. లీజు లైసెన్సులను రద్దు చేయాలని కోరారు.