Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19,20 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త నిరసనల్లో కార్మిక వర్గం పాల్గొనాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యాదాద్రి భువనగిరి జిల్లాలో రామకృష్ణగౌడ్ను అతికిరాతకంగా కుల దురంహకార హత్య చేయించిన వారిని కఠిన శిక్షించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ ఘటనను నిరసిస్తూ మంగళ, బుధవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాల్లో కార్మికవర్గమంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. రామకృష్ణగౌడ్ను సొంత మామే సుపారి ఇచ్చి హత్య చేయించడం దుర్మార్గమని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు మనువాద భావజాలాన్ని ప్రజల్లోకి వ్యాపింపజేసి ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయని విమర్శించారు.ఫలితంగానే ఇలాంటి కుల దురంహకార హత్యలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు.