Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు గంజాయి స్మగ్లర్లు అరెస్ట్
- 190 కేజీల గంజాయి, 5 ఫోన్లు స్వాధీనం
- అరెస్టయిన వారిలో సినీ అసిస్టెంట్ డైరెక్టర్
నవతెలంగాణ-హయత్‌నగర్
విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌తోపాటు ఇతర రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను మీర్‌పేట పోలీసులు పట్టుకున్నారు. సినీ అసిస్టెంట్ డైరెక్టర్‌తోపాటు మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 190 కేజీల గంజాయి, 5ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం హైదరాబాద్ ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాల యంలో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లాకు చెందిన సేనావత్ కృష్ణ సరూర్‌నగర్‌లో నివాసముం టున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని గంజాయి స్మగ్లర్‌గా మారాడు. పలుసార్లు జైలుకెళ్లొ చ్చినా నిందితుడిలో మార్పురాలేదు. రాజమండ్రి జైల్లోవున్న సమయంలో భద్రాది కొత్తగూడెంకు చెందిన బోద హాతీరాంతో పరిచయమైంది. అతని సహకారంతో భద్రాచలంకు చెందిన సభావత్ బాలు, నల్లొండ జిల్లాకు చెందిన నేనావత్ హరి, నేనావత్ అశోక్, రమావత్ రోహిత్, రమావాత్ కిరణ్‌లతో కలిసి ఒక ముఠాగా ఏర్పాడ్డారు. అశోక్, హరి పెట్టుబడుటు పెట్టగా ఒక మారుతీ కారు కొనుగోలు చేశారు. కిరణ్, రోహిత్‌లను డ్రైవర్లుగా పెట్టుకునా ్నరు. విశాఖ, భద్రాచలం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేస్తున్న నిందితులు ముంబాయి, కర్నాటక, హైదరాబాద్‌లో విక్రయిస్తున్నారు. సోమవారం మీర్‌పేట మీదుగా కర్నాటకకు గంజాయి తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న మీర్పేట్ పోలీసులు.. మంద మల్లమ్మ క్రాస్‌రోడ్ వద్ద నిందితులు ప్రయాణిస్తున్న కారును తనిఖీ చేశారు. కారులో ఉన్న 190కేజీల గంజాయిని గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీసీపీ తెలిపారు. మీడియా సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ పురోషోత్తం రెడ్డి, మీర్‌పేట ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, ఎస్ఐలు మారయ్య, గోవింద్ స్వామి, సిబ్బంది శివరాజ్, ఓం ప్రకాష్, విజరు కుమార్ రెడ్డితోపాటు తదితరులు పాల్గొన్నారు.
గంజాయి కేసులో సినీ అసిస్టెంట్ డైరెక్టర్
గంజాయి సరఫరా చేస్తున్న మరో ఘటన కేసులో సినీ అసిస్టెంట్ డైరెక్టర్ హాథీరామ్ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. చాలాకాలం నుంచి సినిమా ఆర్టిస్టులకు హాథీరామ్ గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కర్నాటక నుంచి హైదరాబాద్‌కు గంజాయిని సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. కురుక్షేత్రం, యుద్ధం శరణం గచ్చామి సినిమాలకు హాథీరామ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ కేసులో హాథీరామ్ను ఏ2 నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.