Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3 నెలలు పైలట్ ప్రాజెక్ట్
- సక్సెస్ అయితే...రాష్ట్రవ్యాప్తంగా అమలు
- టీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్టేషన్ (ఎమ్జీబీఎస్)లో ప్రయాణీకుల సౌకర్యార్థం ఉచిత మరుగుదొడ్లను అందుబాటులోకి తెస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు సోమవారంనాడాయన ఎమ్‌జీబీఎస్‌లో ఉచిత మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు నెలలు పైలట్ ప్రాజెక్ట్‌గా దీన్ని చేపడతామనీ, సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో అమల్లోకి తెస్తామన్నారు. ఇప్పటివరకు బస్టాండ్లలో 'పే అండ్ యూజ్' పద్ధతిలో మరుగుదొడ్లను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఎత్తివేసి ఉచిత సేవగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. మరుగుదొడ్ల నిర్వహణలో ప్రయాణీకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్డీ వెంట గ్రేటర్ హైదరాబాద్‌జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ పురుషోత్తం, రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ పీ సాల్మన్ తదితరులు ఉన్నారు. ఇటీవలే వివిధ సెస్‌ల పేరుతో ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణీకులపై చార్జీల భారం మోపిన విషయం తెలిసిందే. ఆ సెస్సుల్లో ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాల కల్పన సెస్‌ను కూడా విధించడం గమనార్హం.