Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో పీజీ సీట్ల బ్లాక్ దందా ప్రయత్నాలు జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ పరిధిలో 26 మెడికిల్ కాలేజీలున్నాయి. ఈ కాలేజీల్లో ప్రస్తుతం ఆడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మెరిట్ విద్యార్ధులు కూడా మేనేజ్మెంట్ కోటా కింద దరఖాస్తులు చేసుకోవడం పట్ల అధికారులకు అనుమానం వచ్చింది. దీనిపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ సదరు విద్యార్థులకు లేఖ రాశారు. అయితే తాము మేనేజ్మెంట్ కోటా కింద దరఖాస్తు చేసుకోలేదని వారు చెప్పడంతో యూనివర్సిటీ అధికారులకు అనుమానం బలపడింది. సీట్లను బ్లాక్ చేసే ఉద్దేశంతో మెరిట్ స్టూడెంట్స్ పేరుతో వేరే వ్యక్తులు ఇలా చేశారా అని అనుమానించారు. ఈ విషయాన్ని మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. దాంతో దీనిపై వరంగల్ సీపీ తరుణ్ జోషీకి రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. కొన్ని మెడికల్ కాలేజీల యాజమాన్యాలే సీట్ల బ్లాక్ దందా కొనసాగిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.