Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పోలీస్స్టేషన్లో ఓ పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనకు మంత్రి పువ్వాడ అజరు బాధ్యత వహించాలనీ, ప్రభుత్వం ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో వేరు పార్టీల కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్టు నమోదు చేసి వేధిస్తున్నారని చెప్పారు. కోర్టు ఆదేశాలిచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. ఈ విషయంలో ఏసీపీ తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నారు. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజరు ఏ1 నిందితుడు అని ఆరోపించారు. పోలీస్స్టేషన్లో ఆత్మహత్య చేసుకుంటే, ఏసీపీకి సంబంధం లేదా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్లో మాదిగలకు అన్యాయం : సతీష్ మాదిగ
కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నియమించిన పదవుల్లోనూ తమకు స్థానం దక్కలేదన్నారు. టికెట్ల విషయంలోనూ పార్టీ చిన్నచూపే చూస్తున్నారని నవతెలంగాణకు చెప్పారు. ఒక కార్యకర్తగా అచ్చంపేట నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తుంటే, అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా ఈనెల ఐదున ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తాననీ, ఈనెల 7న బీజేపీలో చేరుతానన్నారు.