Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ అన్వేష్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం శనగల కొనుగోలు నిలిపేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారనీ, వెంటనే వాటిని కొనుగోలు చేయాలని కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ సుంకేట అన్వేష్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో 3.70లక్షల ఎకరాల్లో ఆ పంట సాగు అవుతుం డగా, ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోనే లక్షా 50 వేల ఎకరాల్లో సాగవు తున్నదని తెలిపారు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శనగ పంట కొనుగోలు చేయాలంటూ ఆ జిల్లా కాంగ్రెస్ నాయకుల ఆందోళన చేస్తే వారిపై పోలీసులు దాడి చేశారనీ, ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు సుజాతకు గాయమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆజిల్లాకు చెందిన ఎమ్మెల్యే జోగు రామన్న గంటల తరబడి రోడ్డు మీద కూర్చుంటే, ఏమీ అనని పోలీసులు...కాంగ్రెస్ నేతలను ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు. ఆ జిల్లాలో ఇప్పటివరకు 30 శాతం మాత్రమే శనగ పంట కొనుగోలు చేశారనీ, వెంటనే మిగతా పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
అరాచకానికి టీఆర్ఎస్ రాచబాటలు : పీసీసీ చీఫ్ రేవంత్ ట్వీట్
రాష్ట్రంలో అరాచకానికి టీఆర్ఎస్ ప్రభుత్వం రాచబాటలు వేస్తున్నదంటూ తాను కొద్ది రోజులుగా చెబుతున్న విషయాలు వాస్తవమని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అది వాస్తవమనడానికి ఇటీవల కేసీఆర్ ముఠా చేస్తున్న ఆగడాలే నిదర్శనమని తెలిపారు. ఈమేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. గులాబీ మూకపై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైందనీ, బీ రెడీ! అంటూ పేర్కొన్నారు.