Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వాహకుల వేధింపులు.. యువకుడి ఆత్మహత్య
నవతెలంగాణ-ధూల్‌పేట్
ఆన్లైన్ లోన్ యాప్‌ల విషయంలో పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక హైదరాబాద్‌లో మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జియాగూడకు చెందిన రాజ్‌కుమార్ ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా రూ.12 వేలు అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే లోన్ రిఫరెన్స్ కింద స్నేహితుల ఫోన్ నెంబర్లను కూడా వారికి ఇచ్చాడు. తీసుకున్న రుణంలో ఈఎంఐ ద్వారా రూ.4 వేలు చెల్లించాడు. మిగతా బాకీ చెల్లించలేదంటూ.. లోన్‌యాప్ నిర్వాహకులు రాజ్‌కుమార్ స్నేహితులకు మెసేజ్‌లు పంపించారు. ఫోన్ చేసి వేధించారు. దాంతో మనస్తాపానికి గురైన రాజ్‌కుమార్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కుల్సుంపుర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.