Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు చాడ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శ్రీరాంసాగర్ వరద కాలువలో భాగంగా మంజూరు చేసిన తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేసినందున సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇప్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. ఆ రిజర్వాయర్‌ను రద్దు చేసినందున ఓగులాపూర్, వరుకోలు, రామచంద్రాపూర్‌లో రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆ భూములకు సంబంధించిన రైతులే మోకాపైన ఉండి సాగుచేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారని వివరించారు. అప్పుడు ఎకరానికి కేవలం రూ.2.10 లక్షలు, మరికొందరికి రూ.3.50 లక్షల వరకు ఇచ్చారని గుర్తు చేశారు. ఓగులాపూర్‌లో దాదాపు 461 ఎకరాల భూమిని సేకరించారని తెలిపారు. అందులో కొద్ది భూమికి డబ్బులూ ఇవ్వలేదని పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేయాలని కోరారు. అధికారులతో కమిటీ వేసి ప్రజల ఆకాంక్షలను గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
దుర్గాదేవి మరణం పట్ల సీపీఐ సంతాపం
ఐద్వా నాయకురాలు కొండపల్లి దుర్గాదేవి మరణం పట్ల సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, తెలంగాణ అమరవీరుల ట్రస్ట్ కార్యదర్శి కె ప్రతాప్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె కుటుం సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.