Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోగుల సహాయకులకు రూ.5కే భోజనం
- హరేకృష్ణతో టీఎస్ఎంఐడీసీ ఒప్పందం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల సహాయకులకు ఐదు రూపాయలకే భోజనం ఇచ్చేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఎంఐడీసీ), స్వచ్ఛంద సంస్థ హరేకృష్ణ మూవ్మెంట్ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు సమక్షంలో సదరు ఒప్పందంపై టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, హరేకృష్ణ మూవ్మెంట్ ఫౌండేషన్ సీఈవో శ్రీమాన్ కాంతేయ దాస ప్రభు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వాస్పత్రుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. రోగుల సహాయకుల భోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.38.66 కోట్లు వెచ్చించనున్నది.
ఒక ప్లేటుకు రూ.21.25 చెల్లించనున్న సర్కారు
ఒక ప్లేటు భోజనానికి రూ.26.25 ఖర్చు కానుండగా అందులో రూ.21.25ను రాష్ట్ర ప్రభుత్వం, ఐదు రూపాయలను రోగుల సహాయ కులు చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం పెరుగన్నం, పులిహౌర, వెజిటబుల్ పలావ్, సాంబర్ రైస్‌తో పాటు పచ్చడి బ్రేక్‌ఫాస్ట్‌గా అందిస్తారనీ, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్గా అన్నం, సాంబర్ లేదా పప్పు, పచ్చడి, సబ్జీ వంటివి ఇస్తారని చెప్పారు. డిస్పోజబుల్ ప్లేట్లు, వాటర్ గ్లాసులు ఇవ్వనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉస్మానియా, నిమ్స్, గాంధీ, నిలోఫర్, సరోజిని దేవి, పేట్లబురుజు, ఎంఎన్‌జే క్యాన్సర్, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల, కోఠి ఈఎన్టీ, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, కోఠి ప్రసూతి ఆస్పత్రులు, గచ్చిబౌలి టిమ్స్, కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి, మలక్‌పేట, గోల్కొండ, వనస్థలిపురం, కొండాపూర్, నాంపల్లి ఏరియా ఆస్పత్రుల్లో ఈ సౌకర్యం కల్పించనున్నారు. ప్రతి రోజు దాదాపు 20 వేల మంది దీంతో లబ్దిపొందుతారని అంచనా.
పది రోజుల్లో ప్రారంభం...హరీశ్ రావు
రాబోయే 10 రోజుల్లో జంటనగరాల్లో 18 ఆస్పత్రుల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులను భాగస్వా ములను చేసి ఒకే సమయంలో ఈ సదుపా యాన్ని ప్రారంభించనున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆస్పత్రులను వ్యక్తిగతంగా ఏర్పాట్లు చూడాలని టీఎస్ఎంఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్ర శేఖర్ రెడ్డిని మంత్రి ఆదేశించారు. హరేకృష్ణ మూవ్ మెంట్ చిత్తశుద్ధితో పని చేసే సంస్థ అంటూ ఆ సంస్థ చైర్మెన్ సత్యగౌర చంద్రకు మంత్రి కృత జ్ఞతలు తెలిపారు. ఈ కార్యకమ్రంలో హరేకృష్ణ మూ మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్‌కు చెందిన శ్రీమాన్ ధనుంజయ దాసప్రభు, టీఎస్ఎంఐడీసీ చైర్మెన్ ఎర్రో ళ్ల శ్రీనివాస్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ డీఎంఈరమేష్ రెడ్డి, రాష్ట్ర ప్రజారోగ్య సంచాల కులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.