Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10శాతానికిపై వృద్ధి నమోదు
హైదరాబాద్ : 2021-22 ఆర్థిక సంవత్సరంలో 10.39శాతం వృద్ధి నమోదుచేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లాభాలబాటలో పయనిస్తోంది. నగదు డిపాజిట్లలో, వివిధ రకాల రుణాల మంజూరులో బ్యాంక్ మెరుగైన ప్రదర్శన నమోదుచేసిందని మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మెన్ వి.అరవింద్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా బ్యాంకుకు 426 శాఖలున్నాయని, 39లక్షలకుపైగా కస్టమర్లు బ్యాంకు సేవల్ని పొందుతున్నారని వి.అరవింద్ పేర్కొన్నారు. వ్యవసాయం, పరిశ్రమల్లో ముఖ్యంగా మహిళలకు ముద్రా రుణాలు, ఎంఎస్ఈ రుణాలు పెద్ద ఎత్తున మంజూరుచేశామని, గృహ, విద్యా, వాహన రుణాలు, బంగారంపై రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. అంతేగాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుజేస్తున్న పలు సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలైన పీఎంఏవై, ఆర్వైఎస్, సీఎస్ఐఎస్, డీఈడీలు, ఎస్సీఏపీ, ఎస్టీ ఏపీ..మొదలైనవి తమ బ్యాంక్ శాఖల ద్వారా కస్టమర్లకు అందజేస్తున్నామని అరవింద్ అన్నారు. ఇతర ప్రభుత్వబ్యాంకు లతో పోల్చితే తమ వద్ద డిపాజిట్లకు అధిక వడ్డీ అందజేస్తున్నామని, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొ చ్చామని చెప్పారు.
ఆధార్ ఆధారితవీడియో కేవైసీతో బ్యాంకుఖాతాను పొంద వచ్చునని, అలాగే ఖాతాదార్లకు బీమా సేవలు అందిస్తుమని తెలిపారు.