Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టప్పాచబుత్ర పీఎస్ పరిధిలో ఘటన
నవతెలంగాణ-ధూల్‌పేట్
కరెంటు బిల్లు కట్టనందుకు విద్యుత్ సరఫరా నిలిపేశారన్న ఆగ్రహంతో కొందరు యువకులు అసిస్టెంట్ ఇంజినీర్‌పై దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని పాతబస్తీ టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కరెంటు బకాయిలు చెల్లించకపోవడంతో కార్వాన్ ఎలక్ట్రిక్ అధికారులు ఇక్కడి పలు ఇండ్లకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. విషయం తెలుసుకున్న కొందరు యువకులు అసిస్టెంట్ ఇంజినీర్ విజరు కుమార్ ఆఫీసుకి వెళ్లి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఏఈ విజరుకుమార్పై దాడి చేశారు. ఈ ఘటనను ఓ యువకుడు వీడియో తీసి పోలీసులకు సమాచారం అందించాడు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడిచేసిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసింది వాల్మీకినగర్‌కు చెందిన విశాల్‌గా గుర్తించారు. విశాల్ కొన్నాళ్లుగా కరెంటు బిల్లు చెల్లించకపోవడంతో రూ.15 వేలు పెండింగ్ ఉంది. దీంతో మంగళవారం మధ్యాహ్నం అధికారులు విద్యుత్ కనెక్షన్ తొలగించారు.