Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజు చెల్లింపు గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలస్య రుసుం రూ.ఐదు వేలతో బుధ, గురువారాల్లో ఫీజు చెల్లింపునకు అవకాశముందని తెలిపారు. ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు విద్యార్థుల నుంచి ఫీజు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో వచ్చేనెల ఆరో తేదీ నుంచి 24వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.