Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైంటేబుల్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి విద్యార్థులకు వచ్చేనెల ఆరో తేదీ నుంచి ప్రీఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ ఎం రాధారెడ్డి మంగళవారం టైంటేబుల్‌ను విడుదల చేశారు. వచ్చేనెల 12వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వివరించారు. వచ్చేనెల ఆరో తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు/ఉర్దూ), ఏడో తేదీన సెకండ్ లాంగ్వేజ్ (తెలుగు/హిందీ/ఉర్దూ), తొమ్మిదో తేదీన థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్), పదో తేదీన మ్యాథమెటిక్స్, 11వ తేదీన సైన్స్, 12వ తేదీన సోషల్ స్టడీస్ పరీక్షలుంటాయని పేర్కొన్నారు. ఉదయం 8.30 నుంచి 11.45 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో 11 పేపర్ల నుంచి ఆరు పేపర్లకే ప్రభుత్వం కుదించిన విషయం తెలిసిందే.