Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హన్మకొండ జిల్లాలో
నవతెలంగాణ-శాయంపేట
వివాహం జరిగి.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రేమ పేరుతో ఓ యువతిని వేధింపులకు గురి చేయడంతో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా తహరాపూర్ గ్రామానికి చెందిన దొంగరి సంగీత (30) ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఐసీడీఎస్ సూపర్వైజర్గా పని చేస్తోంది. హనుమకొండ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సర్వేష్ యాదవ్ తనకు పెండ్లి కాలేదని సంగీతకు చెప్పి ప్రేమ పేరుతో నమ్మించాడు. సంగీత బంధువులు సర్వేష్కు వివాహమైన విషయం తెలుసుకుని ప్రేమ పేరుతో వెంట పడొద్దని పెద్దమనుషుల సమక్షంలో చెప్పారు. అయినా మూడు నెలలుగా సంగీతకు తరచూ ఫోన్ చేస్తూ వేధిం చాడు. సోమవారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన సంగీత రాత్రి సర్వేష్ యాదవ్ వేధింపులకు తాళలేక ఇంట్లో పురుగుల మందు తాగింది. తల్లిదండ్రులు ఆమెను పరకాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోలో మృతిచెందింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ సర్వేష్ యాదవ్ వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి దొంగ వీరయ్య ఫిర్యాదు చేశారు.