Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ర్యాంకర్లను ప్రకటించిన మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సెమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ లెవెల్ టాలెంట్ టెస్ట్- 2022 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. జాతీయ స్థాయిలో ర్యాంకర్ల వివరాలను విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. పదో తరగతిలో కరీంనగర్ జిల్లాకు చెందిన రోజర్ ఎ రాజు, తొమ్మిదో తరగతిలో రంగారెడ్డి జిల్లాకు చెందిన నల్ల చందన, హైదరాబాద్‌కు చెందిన బెల్ల చరిత, ఏడో తరగతిలో నల్లగొండ జిల్లాకు చెందిన రేగులగడ్డ ఆదిత్య, నిర్మల్‌కు చెందిన సయ్యద్ డానిశోద్దీన్, ఆరో తరగతిలో హైదరాబాద్‌కు చెందిన పి గురు యశ్వంత్, సూర్యాపేట్‌కు చెందిన గుండాల మోక్షిత, మేడ్చల్‌కు చెందిన ఇక్క కుమారి, ఐదో తరగతిలో మహబూబ్‌నగర్‌కు చెందిన ఫారియా షాజీన్, వికారాబాద్‌కు చెందిన లౌకిక్యా, నాలుగో తరగతిలో నిర్మల్‌కు చెందిన రాజేష్ చంద్ర, రంగారెడ్డికి చెందిన నికిల్దీటి, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ముజాఫర్ అహ్మద్, ఎ లౌక్యశ్రీ, మూడో తరగతిలో వికారాబాద్‌కు చెందిన సహస్ర ప్రథమ ర్యాంకులు పొందారని వివరించారు. ఈనెల 25న హైదరాబాద్‌లోని సత్యసాయి నిగమాగమంలో అవార్డులు ప్రదానం చేస్తామని సెమ్స్ కన్వీనర్ ఆరుకాల రామచంద్రారెడ్డి, కోఆర్డినేటర్ ఎస్ఎన్ రెడ్డి, ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు కందాల పాపిరెడ్డి, నాయకులు చింతల రాంచందర్ ప్రకటించారు.