Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణం
నవతెలంగాణ-కొత్తగూడెం
మానసిక వికలాంగురాలిపై ఓ కామాంధుడు లైంగికదాడికి ఒడిగట్టాడు. న్యాయం చేయాలని బాధితులు ఊరి పెద్దలను అశ్రయిస్తే పోలీసులకు చెబితే ఊరి నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మర్రిగూడెం గ్రామంలో గిరిజన కుటుంబానికి చెందిన మానసిక వికలాంగురాలు ఈనెల 15న బహిర్భూÛమికి వెళ్లిన సందర్భంలో అదే గ్రామానికి చెందిన ఎట్టి కృష్ణ అనే వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. తన కుమార్తె ఎంతకి రాకపోవడంతో తల్లి వెతుక్కుంటూ వెళ్లింది. సమీపంలో కూతురు కనిపించగా ఆమె తీరు చూసి లైంగికదాడికి గురైనట్టు గమనించారు. అదే గ్రామానికి చెందిన ఎట్టి కృష్ణ ఈ అఘయిత్యానికి పాల్పాడ్డాడని కుటుంబ సభ్యులు ఊరి పెద్దలకు తెలిపారు. ఈ విషయం పంచాయితీ చేద్దామని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఊరి నుంచి బహిష్కరిస్తామని భయబ్రాంతులకు గురిచేశారు. గ్రామపెద్దలు కాలయాపన చేస్తుండటంతో బాధిత కుటుంబ సభ్యులు ఈనెల 16న లక్ష్మీదేవిపల్లి పోలీసులను అశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈనెల 17న నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.