Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్గత సామర్ధ్యం పెంపునకు డిస్కంల ఉత్తర్వులు
- అదనపు ఆదాయ లక్ష్యం రూ.2,687 కోట్లు
- సర్కిళ్ల వారీగా టార్గెట్లు
- వచ్చే నెల బిల్లుల్లో పెరిగిన చార్జీలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వినియోగదారులకు పెరిగిన కరెంటు చార్జీలు మే నెల బిల్లుల్లో రానున్నాయి. ఆ సొమ్ము కాకుండా అదనంగా ఈ ఆర్థిక సంవత్సరంలో అంతర్గత సామర్ధ్యం పేరుతో రూ.2,687 కోట్లు వసూలు చేయాలని టీఎస్‌ట్రాన్స్‌కో, జెన్కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలు) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డిస్కంలు సర్కిళ్ల వారీగా అంతర్గత సామర్థ్య టార్గెట్ల లక్ష్యాలను నిర్థారిస్తూ టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి సర్క్యులర్ జారీ చేశారు. ఆయా సర్కిళ్ల పరిధిలో వందశాతం మీటర్ రీడింగ్, బిల్లు వసూళ్లు జరగాలని పేర్కొన్నారు. అవి కాకుండా 2022 మార్చి 31నాటికి ఉన్న పెండింగ్ బిల్స్ అన్నింటినీ వసూళ్లు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దానికి సంబంధించి సర్కిల్ వారీగా టార్గెట్లను నిర్దేశించారు. ఫ్రీజ్ చేసిన కనెక్షన్లు, బిల్ స్టాప్డ్ సర్వీసుల నుంచి వసూళ్లు చేయకుంటే, వారిపేర్లపై ఉన్న ఇతర కనెక్షన్లను (లింక్ సర్వీసులు) కూడా కరెంటు సరఫరా నిలిపేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిస్కం పరిధిలో అలాంటి కనెక్షన్లన్నింటినీ గుర్తించి నోటీసులు ఇవ్వాలనీ, కస్టమర్ చార్జీలు, పాత బకాయిలతో సహా పూర్తి బిల్లులు, పెనాల్టీలు కట్టాకే సర్వీసులు పునరుద్ధరించాలని ఆదేశించారు. అందుకు భిన్నంగా ఎవరైనా వ్యవహరిస్తే సంబంధిత ఉద్యోగులు, అధికారుల నుంచే ఆయా బిల్లుల మొత్తం వసూలు చేస్తామని హెచ్చరించారు. కాలిపోయిన, పనిచేయని కరెంటు మీటర్లను తక్షణం మార్చాలనీ, సంబంధింత ఏఈ, ఓ అండ్ ఎమ్ సిబ్బంది ఏడీఈ ఆపరేషన్‌కు నెలరోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. సంస్థకు నష్టం చేసే ఎలాంటి చర్యలు ఉద్యోగులు చేపట్టినా వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎల్టీ డొమెస్టిక్ కామన్ సర్వీసులను ఎల్టీ-1(బీ)(2) కేటగిరిలో బిల్లులు ఇవ్వాలనీ, వాటికి ప్రత్యేక ఈబీఎస్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొత్తం 31 అంశాలపై సర్కిళ్ల వారీగా ఆదేశాలు జారీ చేశారు. వాటిలో వ్యవసాయ ఫీడర్లు, డీటీఆర్ వద్ద స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లు వంటివి ఉన్నాయి.