Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే ఈ నెల 26న అంజయ్యభవన్ ముట్టడి
- రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌కు ఐక్య సంఘాల మెమోరాండం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
షెడ్యూల్డ్ పరిశ్రమల కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని రాష్ట్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. లేదంటే ఈ నెల 26న అంజయ్యభవన్ను ముట్టడిస్తామని ప్రకటించింది. సోమవారం హైదరాబాద్‌లో కార్మిక సంఘాల నేతలు ఆ శాఖ కమిషనర్‌కు వినతిపత్రాన్ని కార్మిక సంఘాల నేతలు అందజేశారు. 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్ జీఓలకు గానూ ఐదు జీఓలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి, గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయకపోవడం అన్యాయమన్నారు. తక్షణం గెజిట్‌లో ప్రకటించాలనీ, మిగిలిన 68 జీఓలను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీఓల జారీపై రాష్ట్ర కార్మికశాఖ సానుకూలంగా స్పందించకపోతే ఏప్రిల్ 26న ''లేబర్ ఆఫీస్'' వద్ద మహా ధర్నా చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, జె.వెంకటేశ్ (సీఐటీయూ), ఎమ్డీ యూసుఫ్ (ఏఐటీయూసీ), కె.సూర్యం (ఐఎఫ్టీయూ), ఆదిల్షరీఫ్ (ఐఎన్టీయూసీ), అనురాధ (ఐఎఫ్టీయూ), ఆయా కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.