Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ సంతోష్‌కుమార్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌తో కోయంబత్తూరుకు చెందిన ప్రఖ్యాత ఈశా షౌండేషన్ ప్రతినిధులు మంగళవారం హైదరాబాదలో సమావేశమయ్యారు. తాము చేపట్టిన ''సేవ్ సాయిల్'' ఉద్యమానికి మద్దతివ్వాలని ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు ప్రసాద్, శైలజ, రాఘవ తదితరులు ఎంపీని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ పుడమి పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా ''హరా హైతో భరా హై'' అనే గొప్ప నినాదంతో 17 జూలై 2018న తాము ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం నేడు హరిత కార్యక్రమాల్లో గొప్ప విప్లవంగా మారి, అనుకున్న లక్ష్యాన్ని చేరిందని ఈశా ఫౌండేషన్ సభ్యులకు వివరించారు. మట్టికి - మొక్కకు అవినాభావ సంబంధం ఉన్నట్టే ఈశా ఫౌండేషన్ చేపట్టిన సేవ్ సాయిల్ ఉద్యమానికి, తాము చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమానికి కూడా అదే సంబంధం ఉంటుందని అన్నారు. అందుకే ''మట్టిని కాపాడుకుందాం - మొక్కను బతికించుకుందాం'' అని ఆయన వ్యాఖ్యానించారు. సేవ్ సాయిల్ ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.