Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భూగర్భ జలాల పరిరక్షణ అనేది అందరి బాధ్యత అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవాలను పురస్కరించుకుని జల మండలి, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం మంత్రుల నివాస సముదాయంలో భూగర్భ జలాల పరిరక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ..రోజు రోజుకూ అడుగంటుతున్న భూగర్భ జలాలను పరిరక్షించుకుని నీటి నిల్వలను పెంపొందించుకోవాల్సిన బాధ్యత నగర ప్రజలందరిపైనా ఉన్నదనీ, ప్రతి ఒక్కరూ తమ ఇంటి అవరణంలో విధిగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుని రాబోయే వర్షాకాలంలో ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే తరాలకు నీటి నిల్వలను తరగకుండా అందించడమే మన ధ్యేయమన్నారు. రాష్ట్రంలో సాగు, తాగునీటి కొరత లేకుండా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. కాళేశ్వరం పూర్తయిందనీ, పాలమూరు- రంగారెడ్డి 70 శాతం పూర్తయిం దని తెలిపారు. వ్యవ సాయ రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడం ద్వారా తెలంగాణ కీర్తిని కేసీఆర్ ఇనుమ డింపజేశారని కొనియా డారు. హైదరాబాద్‌లో ఉచితంగా తాగునీటి సరఫరా జరుగు తున్న దన్నారు. ఈ సందర్భంగా ప్లకా ర్డులు, కర్రపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జలమండలి డీజీఎం శ్రీనివాస్ రావు, జీఎం రాంబాబు, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ సంస్థ ప్రతినిధులు డాక్టర్ యానల ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ మైనేని వాణి, పి గిరిధర్ గౌడ్, నరేష్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.