Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహిళలు, చిన్నారుల ప్రత్యేక అంకుర ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను రాబోయే కాలంలో వెయ్యి నుంచి రెండు వేలకు పెంచనున్నారు. బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అంకుర హాస్పిటల్స్ ఎండీ కృష్ణ ప్రసాద్, హాస్పిటల్ ప్రచారకర్త నటుడు సోనూసూద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 12 కేంద్రాల్లో ఉన్న ఆస్పత్రులను మహారాష్ట్ర, కర్నాటక, ఒడిషాలకు విస్తరించనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది హైదరాబాద్లో మరో నాలుగు ఆస్పత్రులను ప్రారంభించనున్నట్టు చెప్పారు. సోనూసూద్ మాట్లాడుతూ అంకురతో తనకున్న అనుబంధం ఎంతో ఆనందాన్నిస్తున్నదని తెలిపారు. కరోనా కాలంలో అనారోగ్యానికి గురైన ఎంతో మందికి తాను సిఫారసు చేస్తే ఆ సంస్థ కాపాడిందని గుర్తుచేశారు.