Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన అధ్యాపకులకు ప్రిన్సిపాల్‌గా పదోన్నతి కల్పిస్తూ కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ఐదుగురు అధ్యాపకులకు ప్రిన్సిపల్ పదోన్నతులు లభించాయి. పదోన్నతి లభించిన వారిలో డాక్టర్ రామ్మోహన్ రెడ్డికి గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిజామాబాద్‌లో, విప్లవ దత్ శుక్లాకు నారాయణపేటలో, డాక్టర్ సంతోష్ కి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరకాలలో, లక్ష్మణ్ నాయక్ కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల షాద్ నగర్లో, అస్లాం ఫరూక్ కి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జహీరాబాద్ లో పోస్టింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెజిటెడ్ అధ్యాపక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఏ.సంజీ వయ్య, డాక్టర్ సురేందర్ రెడ్డి పదోన్నతి పొందిన అధ్యాపకులకు అభినందనలు తెలిపారు.