Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ పర్యాటకాభివద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ)కు చెందిన స్థలాల లీజు అంశాలను పున:స్సమీక్షించాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. బుధవారంనాడా యన తన క్యాంప్ కార్యాలయంలో ఈ అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. షామీర్పేటలోని సికింద్రాబాద్ గోల్ఫ్ కోర్సు ప్రాజెక్టు ప్రయివేట్ లిమిటెడ్ అనే సంస్థ 2004లో గోల్ఫ్‌కోర్స్ నిర్మాణం కోసం 130 ఎకరాల పర్యాటకాభివృద్ధి సంస్ధ స్థలాన్ని 33 సంవత్సరాల లీజుకు తీసుకుని, 18 ఏండ్లుగా అక్కడ ి ఎలాంటి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టలేదనీ, లీజు రెంటు కూడా చెల్లించట్లేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ్లారని చెప్పారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తక్షణం ఆ స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. అదే స్థలంలో స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణం, టూరిజం సర్క్యూట్ అభివద్ధికోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. సికింద్రాబాద్‌లోని బేగంపేటలో బుట్ట హాస్పిటాలిస్ సంస్థ (యాత్రి నివాస్) హౌటల్‌కు గతంలో చేసుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం 100 రూమ్‌ల నిర్మాణం, 3 స్టార్ హౌటల్ స్టేటస్, అలాగే నాన్ లైన్ అక్కౌంట్‌ను పర్యాటకాభివృద్ధి సంస్థతో కలిసి ఓపెన్ చేయకపోవడాన్ని కూడా అధికారులు ప్రస్తావించారు.సదరు సంస్థ టర్నోవర్ రిపోర్ట్‌ను సమర్పించలేదనీ, 2016లో లీజు అగ్రిమెంట్‌ను టెర్మినేట్ చేయడంతో కోర్టును ఆశ్రయించారని తెలిపారు.