Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
స్వరాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ చరిత్రను స్వయంగా రాసుకునే అరుదైన అవకాశం ఆవిష్కృతమయ్యిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కోఠి ఉమెన్స్ కాలేజీ అద్యాపకురాలు డాక్టర్ ఎమ్ దేవేంద్ర రచించిన ''తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ'' పరిశోధనా గ్రంథాన్ని బుధవారంనాడామె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళలు, సాహిత్యం తెలంగాణ సమాజానికి పంచ ప్రాణాలుగా నిలుస్తాయన్నారు. తరతరాల మూల సంస్కతి, సమాజ పరిణామ క్రమం, చరిత్ర, సాహిత్యంపై విస్తతంగా పరిశోధనలు జరగవలసి ఉన్నదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ఆటుపోట్లన్నీ కథలు, పాటలు, కవితలు, నవలల్లో నిక్షిప్తమై ఉన్నాయని వివరించారు. తెలంగాణ సాహిత్యం కల్పన కంటే వాస్తవికతకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జూలూరు గౌరీశంకర్, గాయత్రి రవి, కథా రచయిత్రి డాక్టర్ ఎమ్ దేవేంద్ర, అధ్యాపకులు ఎమ్ నర్సింహాచారి, తదితరులు పాల్గొన్నారు.