Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తొలి ఉత్పత్తి అభివృద్ధి కార్యక్రమం - రుబ్రిక్స్ కోసం 13 అంకుర సంస్థలను ఎంపిక చేసినట్టు టి-హబ్ తెలిపింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా 135 దరఖాస్తులు రాగా పరిశ్రమల నిపుణులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల సలహాలతో ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్టు వెల్లడించింది. ఉత్పత్తులకు, మార్కెట్కు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు టీ-హబ్ సీఈవో ఎంఎస్ఆర్ తెలిపారు.