Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితకు టీఎంఎస్టీఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు వచ్చేనెలలో చేపట్టాలని తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యామంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని బుధవారం హైదరాబాద్‌లో సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూతం యాకమల్లు, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. తొమ్మిదేండ్లుగా ఒకే దగ్గర పనిచేస్తూ బదిలీల్లేక మానసిక ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. ఈ వేసవి సెలవుల్లో బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. ఐదేండ్లు ఒకే దగ్గర పనిచేస్తున్న టీచర్లను తప్పనిసరిగా బదిలీ చేయాలని సూచించారు. ప్రతినెలా వేతనాలు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వేసవిలో బదిలీలు, పదోన్నతులు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.