Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణ జరపండి
- పీఎం, హోంమంత్రి, సీబీఐ డైరెక్టర్‌కు రేవంత్ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గోదాముల నుంచి మాయమైన ధాన్యంపై సీబీఐ విచారణ జరిపించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి కోరారు. ఈమేరకు బుధవారం ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, సీబీఐ డైరెక్టర్‌కు ఆయన లేఖ రాశారు. రబీ సమయంలో సీఎం కేసీఆర్ అనిశ్చితి, గందరగోళం, ఆలస్యం వల్ల ధాన్యం సేకరణలో రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. దాదాపు 35శాతం నుంచి 40శాతం మంది రైతులు ప్రభుత్వ ఉదాసీనత వల్ల దోపిడీకి గురయ్యారని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టమైన వైఖరి లేకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని మధ్యదళారులకు, మిల్లర్లకు అమ్ముకోవాల్సి పరిస్థితి వచ్చిందని వివరించారు. దీంతో తెలంగాణ రైతులకు రూ.3000- రూ.4000 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇది సీఎం కేసీఆర్ బాధ్యతా రహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతులకు జరిగిన అన్ని నష్టాలను తిరిగి పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వరి విషయంలో గందరగోళం సృష్టించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధరలు ప్రకటించి ఉంటే రైతులకు కొంత లాభం జరిగేదని పేర్కొన్నారు. ఎఫ్‌సీఐకి మిల్లర్లు ఇవ్వాల్సిన బియ్యాన్ని నల్ల బజారుకు తరలించారా? విదేశాలకు అమ్ముకున్నారా? అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తావించాన్ని గుర్తు చేశారు. 28 మార్చి 2022నాటి విచారణలో రైస్ మిల్లుల్లో సుమారుగా వేల మెట్రిక్ టన్నుల ఎఫ్‌సీఐ బియ్యం లేకుండా పోయాయని పేర్కొన్నారు.వెంటనే సీబీఐ విచారణ జరిపి దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.