Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మూసీ నదిని శుభ్రత, సుందరీకరణకు ఏవిధమైన కార్యచరణ చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్లకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఒక రిపోర్టు ఇచ్చామంటే చాలదనీ, నది శుభ్రతకు తీసుకున్న చర్యలు చెప్పాలని కోరింది. అదే విధంగా మూసీ శుభ్రతకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించింది. సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాదిరిగా మూసీకి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నదికి పూర్వపు వైభవం తెచ్చేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ వేసింది. దీనిని బుధవారం చీఫ్ జస్టిస్ సతీష్చంద్రశర్మ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. మూసీ దోమలకు నిలయంగా మారిందనీ, వాసన వస్తోందనీ, అశుభ్రంగా మారిందని హైకోర్టు అభిప్రాయపడింది. మూసీ నదిని కాపాడేందుకు తీసుకునే చర్యలపై కార్యచరణ నివేదికను ప్రతివాదులు అందజేయాలనీ, తదుపరి విచారణను ఆగస్టు రెండో వారంలో విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది.